17.2 C
Hyderabad
Friday, November 22, 2024
spot_img

MLA Rajasingh:ప్రధానికి ముఖం చూపించుకోలేకనే అనవసర విమర్శలు చేస్తున్నారు

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణకు వస్తున్నారు. మహబూబ్ నగర్‌‌లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఈసారి కూడా ప్రధానికి స్వాగతం పలకడం లేదు. ఇక, మోదీ పర్యటన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో మరోసారి పోస్టర్లు వెలిశాయి. దీనిపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ప్రధాని మోదీకి ముఖం చూపించుకోలేకనే అనవసర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేసి ప్రజల్లో అభాసుపాలు కావొద్దని సూచించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే మోదీని కలవాలని అన్నారు. ప్రధానిని కలసి తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులను కేసీఆర్ అడగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఏం నిధులు కావాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఎందుకు అడగటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఎంఐఎం, బీఆర్ఎస్‌లు వెన్నుపోటు పార్టీలని విమర్శించారు.యం తెలిసిందే.

Latest Articles

బీఆర్ఎస్‌ మహాధర్నాకు హైకోర్టు అనుమతి

బీఆర్ఎస్‌ మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మహబూబాబాద్‌ MRO కార్యాలయం ఎదుట ఈ నెల 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించుకోవడానికి షరతులతో కూడిన అనుమతి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్