ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో హుజూరాబాద్ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గంలో 40 వేల మందికి పైగా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా స్వయంగా సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ మొత్తం నియోజకవర్గానికి ఇచ్చింది కేవలం 800 ఇళ్ళు మాత్రమే ఇచ్చారని, మరి మిగతా వారికి ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హుజూరాబాద్ లో 106 గ్రామాలు ఉంటే కేవలం ఐదు గ్రామాల్లో మాత్రమే ఇళ్ళు పంపిణీ చేశారని.. మిగతా గ్రామాల ప్రజలకు మొండిచేయి చూపించారని ఫైర్ అయ్యారు.