కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ స్థానిక ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ కే ఇవ్వాలని హాఫీస్ ఖాన్ అనుచరులు, కార్పొరేటర్లు కర్నూలు లో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించిన ఈ భేటీకి వైసీపీ అభిమానులు, హాఫీస్ ఖాన్ అనుచరులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కర్నూలు అభ్యర్థిగా డాక్టర్ ఇలియాజ్ ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో వైసిపి నాయకులు హాఫీస్ ఖాన్ అభిమానులు ఆందోళనతో సమావేశం నిర్వహించారు. తమ నేతకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుంటే వైసిపి పదవులకు కార్పొరేటర్ పదవికి రాజీనామాలు చేస్తా మని వారు హెచ్చరించారు. హాఫీస్ ఖాన్ మాట్లాడుతూ అధిష్టానం తనతో చర్చించారని రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పారని తెలి పారు. రాజ్యసభ వద్దని కర్నూలు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని హాఫీజ్ ఖాన్ అనుచరులు డిమాండ్ చేశారు.


