26.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

       లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సన్నా హాలు జరుగుతుండడంతో..గెలుపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు కమల నాథులు. ఇందులో భాగంగానే ఇవాళ ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం జరగ నుంది. ఈ భేటీలో సుమారు 100కి పైగా లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు సగానికి పైగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ జరుగను న్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి ఈ సమావేశానికి లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఈటల, సంజయ్, డీకే అరుణ హాజరు కానున్నారు. మొదటి జాబితాలో పదిమంది వరకు అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆవావహుల జాబితాను తెలంగాణ బీజేపీ నేతలు హైకమాండ్‌కు పంపినట్లు ప్రచారం జరుగుతోంది.

       తెలంగాణలో 12 స్థానాలపై బీజేపీ ఫోకస్ చేసింది. నాలుగు సిటింగ్ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమా చారం. భువనగిరి, చేవెళ్ల, పాలమూరు అభ్యర్థులు కూడా దాదాపుగా ఖరారయ్యారని సమాచారం. ఎక్కువగా మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానానికి ముఖ్య నేతలందరూ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈసారి హైదరాబాద్ పార్లమెం టు స్థానంపై బీజేపీ గురి పెట్టింది. ఎలాగైనా హైదరాబాద్‌ స్థానాన్ని దక్కించుకోవాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తు న్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశ నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటన మార్చి 4కు వాయిదా పడింది.ఏపీలో పొత్తులపై నిర్ణయం ఆలస్యమయ్యే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ పొత్తులపై చర్చలు ఇంకా కొలిక్కి రాకపో వడంతో మొదట తెలంగాణ అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.

Latest Articles

గొడిచర్ల నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర

   అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. 19వ రోజు అనకాపల్లి జిల్లా గొడిచర్ల నైట్ స్టే పాయింట్ నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్రను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్