నిజామాబాద్ స్కానింగ్ సెంటర్లలో ఓ ఆపరేటర్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. అయ్యప్ప స్కానింగ్ సెంటర్‌లో ప్రశాంత్ అనే ఆపరేటర్ వైద్య పరీక్షలకు వచ్చిన మహిళల వీడియోలు చిత్రీకరిస్తు న్నట్లు గుర్తించారు. వందలాది మహిళల వీడియోలను రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రశాంత్‌ను అరెస్టు చేశారు పోలీసులు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్‌కు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని జిల్లా వైద్యాధికారి ఆదేశాలు జారీ చేశారు.


