బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. పొలంబాటలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమేనని అన్నారు. రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేం దుకు ఖర్చు గురించి ఆలోచించ ట్లేదని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్డీపీసీకి సహకారం అందించలేదని తెలిపారు. ఎన్టీపీసీకి సహకరించి ఉంటే 4 వేల మెగవాట్ల విద్యుత్ ఉచితంగా వచ్చేదని చెప్పారు. విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ ఏదో గొప్పలు సాధించామని చెప్పడం అబద్ధం అని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న ఉత్తమ్….గత బీఆర్ఎ స్ ప్రభు త్వం రైతులకు పంట బీమా ఇవ్వలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్ట్.. వారి హయంలోనే కూలిపోయిందని ఉత్తమ్ విమర్శించారు. కాళేశ్వరం కోసం విద్యుత్ ఖర్చే ఏడాదికి రూ.10 వేల కోట్లు అవుతుందని తెలిపారు. ప్రాజెక్టును కేఆర్‌ఎంబీకి అప్పగించేం దుకు మాజీ సీఎం ఒప్పుకున్నారని చెప్పారు. మిషన్ భగీరథ.. కమీషన్ల భగీరథ అయ్యిందని ఆరోపిం చారు. కేసీఆర్, జగన్ దోస్తీ వల్ల ఏపీ అక్రమంగా రోజుకు 10 టీఎంసీలు తరలించిందని మండి పడ్డారు. ఏపీ రోజూ నీళ్లు తరలిస్తున్నా అప్పటి సీఎం కేసీఆర్ మాట్లాడలేదని ఉత్తమ్ నిప్పులు చెరిగారు.


