22.2 C
Hyderabad
Thursday, December 26, 2024
spot_img

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి హైకోర్టులో ఊరట.. పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు

స్వతంత్ర వెబ్ డెస్క్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నిక చెల్లదన్న పిటిషన్​ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టివేయడంతో శ్రీనివాస్ గౌడ్​కు ఈ కేసులో ఊరట లభించినట్లైంది.  శ్రీనివాస్​గౌడ్​ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో​ తన​ ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని​ రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్​ వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్‌ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పిటిషన్​లో ఆయన పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని.. ఆయన ఎన్నికను రద్దు చేయాలని రాఘవేంద్ర హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సోమవారం రోజున మరోసారి విచారణ జరిపి ఈ వివాదంపై తీర్పు మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇవాళ రాఘవేంద్ర వేసిన పిటిషన్​ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

Latest Articles

విరాట్‌ కోహ్లీపై ఐసీసీ చర్యలు

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మ్యాచ్ రిఫరీ కఠిన చర్యలు తీసుకున్నారు. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు ఓ డీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్