ములుగు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వతంత్ర టీవీ 2025 సంవత్సరం నూతన క్యాలెండర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ములుగు జిల్లాకు చెందిన స్వతంత్ర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. స్వతంత్ర టీవీ ఎవరీ పక్షాన నిలవకుండా నిజాన్ని నిర్బంగా చెబుతూ తాజా వార్తలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తుందని చెప్పారు. సమాజంలోని ప్రతీ సమస్యను వెలికితీసి ప్రజలకు తెలియజేయాలని మంత్రి సీతక్క చెప్పారు.