ములుగు జిల్లా ఏటూరు నాగారానికి ఆర్టీసీ డిపో మంజూరైంది. డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మూడు రాష్ట్రాల సెంటర్‌గా ఉన్న ఏటూరు నాగారానికి ఆర్టీసీ బస్సు డిపో మంజూరు కావటంపై పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఏటూరు నాగారం నగరంలో బస్సు డిపో మంజూరు కావడంతో ఏజెన్సీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్‌కు మంత్రి సీతక్క, ములుగు డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ధన్యవాదాలు తెలిపారు.