గురుకుల అద్దె బిల్డింగుల మీద ప్రశ్నించిన కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. గురుకులాలు మూసివేసేలా చేసేలా కేటీఆర్, హరీష్ రావు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత నాలుగు సంవత్సరాలుగా అద్దె బిల్లులు చెల్లించలేదన్నారు.అద్దె బిల్డింగుల యజమానులు ఎవరి ప్రోద్బలంతో ఇలా చేస్తున్నారో తెలియడం లేదన్నారు. యజమానులకు పెండింగ్ బిల్లులు ప్రభుత్వం బాధ్యతగా చెల్లిస్తుందని.. గురుకుల విద్యార్థులను ఇబ్బందులు కలగజేయద్దన్నారు. అద్దె బిల్డింగులు తాళం వేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలిచ్చామని తెలిపారు.