తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. ఇందులో వాహనదారులకు పలు సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా ఏటా లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదంలో మృతిచెందుతున్నారని చెప్పారు. తెలంగాణలో సగటున రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులందరం కలిసి ఈ పండగకు ఆయుధపూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు.. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందామని ప్రమాణం చేద్దామని సూచించారు.. మద్యం తాగి వాహనం నడపరాదని…. ఇది ప్రమాదానికి సూచిక అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.