కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై మంత్రి పొన్నం సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతల పట్ల కూడా బండి సంజయ్ వ్యవహార శైలి నచ్చడం లేదని అన్నారు. బీజేపీలో బండి సంజయ్‌కు ఈటెల రాజేందర్‌కు విభేదాలున్నాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా నేతలను కూడా ఎంపీ దూరం పెట్టా రన్నారు. మొదటి దశ ఓటింగ్ తర్వాత మోదీ వెన్నులో వణుకు పుడుతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని మోదీ చెప్పడం విచారకరమన్నారు. ప్రధాని స్థాయిలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహించాల్సిన మోదీ నీచంగా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.


