కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర కేబినేట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు పొన్నం హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి, ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌కు 2024- – 25 ఆర్థిక సంవత్సరానికి వచ్చే బడ్జెట్ సెషన్‌లో తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి, కేంద్ర నిధులు మంజూరుకి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతగా వ్యవహరించాలని సూచించారు.


