పద్మశాలీయ బహూత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్నివర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్, బ్రాహ్మణి దంపతులకు బహుత్తమ సంఘం పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. చేనేత కార్మికుల ఆదాయం పెంచడానికి పైలెట్ ప్రాజెక్టుగా వీవర్స్ శాల ఏర్పాటు చేసి టాటా తనేరా కంపెనీతో మార్కెట్ లింకేజ్ చేశామని అన్నారు. మంగళగిరిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అనేక సమస్యలు ఉన్నాయి. తాను వేసే ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపు ఉంటాయని స్పష్టం చేశారు.