20.7 C
Hyderabad
Monday, December 23, 2024
spot_img

మంత్రి కేటీఆర్ ఫ్లయింగ్ కిస్.. సోషల్ మీడియాలో వైరల్‌..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశంలో “ఫ్లయింగ్ కిస్” అనే మాట హాట్ టాపిక్‌గా మారిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పార్లమెంటులో ఫ్లయింగ్‌ కిస్‌ (Flying Kiss) ఇచ్చారంటూ అధికార బీజేపీ నేతలు రచ్చ రచ్చ చేశారు. అధికార సభ్యులవైపు చూపిస్తూ.. అది కూడా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వైపే ఆ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ నానా హంగామా చేశారు. సభలో ఉన్న మహిళా ఎంపీలను రాహుల్ అగౌరవ పరిచారని.. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ కమలనాథులు స్పీకర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. ఇదే విషయం ఇప్పుడు దేశమంతా.. చర్చనీయాంశంగా మారింది. అయితే.. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ మ్యాటరే.. తీవ్ర చర్చనీయాంశం కాగా.. ఇప్పుడు మంత్రి కేటీఆర్(Ktr) కూడా ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఆ వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అయితే.. రాహుల్ గాంధీలా మంత్రి కేటీఆర్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది చట్ట సభల్లో కాదు.. స్కూల్ విద్యార్థులకు. అయితే.. రాహుల్ గాంధీ కంటే ముందే మంత్రి కేటీఆర్ ఈ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. కానీ.. రాహుల్ గాంధీ మాత్రమే ఫేమస్ అయ్యారు. అయితే.. ఆగస్టు 8న మంత్రి కేటీఆర్ వేములవాడలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే.. ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాల పక్కనే జరగగ్గా.. పిల్లలంతా కేటీఆర్‌ను కిటీకీల్లో నుంచి చూసేందుకు పోటీ పడ్డారు. కేటీఆర్ వెళ్తున్నప్పుడు కొందరు విద్యార్థులు ఆయనను పిలిచారు.
దీంతో.. కేటీఆర్ ఆ కిటికీల దగ్గరకూ వెళ్లి ఆ చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. కేటీఆర్ తమను పలకరించటంతో ఆనందంతో కేరింతలు కొట్టారు. ఇది ఏ క్లాస్ అంటూ పిల్లలను అడిగారు. ఐదో తరగతి అని పిల్లలు చెప్పగా.. మరి చదువుకోకుండా నన్ను చూస్తున్నారేంటీ.. క్లాస్‌లో టీచర్ లేదా అని అడిగారు. అయితే.. మంత్రి ప్రశ్నకు ఓ పిల్లాడు.. మేం మీ ఫ్యాన్ సర్.. అంటూ సమాధానం ఇచ్చాడు. దానికి.. నేను కూడా మీ ఫ్యానే అంటూ చెప్తూ.. చిన్నారులకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. కేటీఆర్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వటంతో.. పిల్లలు సంబురంతో కేకలు పెట్టారు. కాగా.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాహుల్ ఫ్లయింగ్ కిస్ వివాదం తెరమీదికి రావటంతో.. మంత్రి కేటీఆర్ ఫ్లయింగ్ కిస్‌ కూడా ఇప్పుడు వైరల్‌గా మారింది.

Latest Articles

డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్