స్వతంత్ర, వెబ్ డెస్క్: నేడు యాదాద్రి భువనగిరి జిల్లా లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో పలు పరిశ్రమలను మంత్రి ప్రారంభించనున్నారు. దండు మల్కాపురం పారిశ్రామిక వాడ లో 40 కోట్లతో నిర్మించిన కామన్ ఫెసిలిటీ భవనం, ఆడిటోరియం, శిక్షణ కేంద్రం భవనాలను ప్రారంభించనున్నారు. సుమారు నూతనంగా ఏర్పాటు చేసిన 51 నూతన కంపెనీలను వ్యాపారవేత్తలకు ఈ సదుపాయాన్ని అందించనున్నారు. ఈ కంపెనీల ప్రారంభంతో సుమారు 35 వెల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుంది. దీనితో పాటుగా ఆసియాలోనే అత్యంత పెద్ద బొమ్మల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన మంత్రి కేటీఆర్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు కొయ్యలగూడెం గ్రామంలో జాతీయ రహదారి పక్కన చేనేత మాల్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు.