హరిత తారామతి బారదారి రిసార్ట్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హరిత రిసార్ట్ నిర్వహణ లోపాలపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిసార్ట్ అంత కలియతిరిగారు. హరిత హోటల్ రూమ్స్, హరిత రెస్ట్రారెంట్, పుష్పాంజలి ఆంఫి థియేటర్, ఆడిటోరియం, స్విమింగ్ ఫూల్, టాయిలెట్స్‌ను పరిశీలించారు. హరిత రిసార్ట్ నిర్వహణపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంట్రెన్స్ దగ్గర గుంతలు పడ్డాయని వెంటనే వాడి మరమ్మతులు చేపట్టాలన్నారు. చెత్త చెదారాన్ని తొలగించాలని, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు.