బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద తీవ్రంగా ఫైర్ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేసీఆర్ చేసిన విమర్శలను ఖండించారు. కేసీఆర్ గత పదేళ్లలో వాస్తవిక బడ్జెట్ పెట్టలేదని అన్నారు. 2022-23 సంవత్సరంలో రెండు లక్షల యాబై వేల కోట్ల బడ్జెట్ పెట్టి కేవం రెండు లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. మిగిలిన యాబై వేల కోట్ల బడ్జెట్ ఖర్చు చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వాస్తవాలకు దగ్గర బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలిపారు. వ్యవసాయ రంగానికి 25 శాతం బడ్జెట్ కేటాయించామన్నారు.


