Minister Harish Rao | సిద్ధిపేటలో ముస్లిం పెద్దలు నిర్వహించిన పవిత్ర రంజాన్ పండుగ వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సూఫీ మసీదు ఆవరణలోని ఈద్గా వద్ద జరిగిన ఈ వేడుకల్లో మంత్రి హరీష్.. ముస్లిం సహోదరులను ఆలింగనం చేసుకొని ఆనందోత్సాహాల నడుమ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టినప్పటినుంచి అందరూ అన్నదమ్ముల వలె పండుగలు జరుపుకుంటున్నారని అన్నారు. సంక్షేమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమంలో ముస్లింలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రజలంతా సంతోషంగా ఉంటే.. కొన్ని పార్టీలు కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని అన్నాడు. ఈ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.