ఢిల్లీలో నీటి కొరతపై నీటి శాఖ మంత్రి అతిషి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష నాల్గవ రోజుకు చేరుకుంది. అతిషి నాల్గవ రోజు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఢిల్లీలో నీటి కొరత ఎక్కువగా ఉండడంతో తాను నిరాహార దీక్ష చేస్తున్నానని చెప్పారు. మూడు వారాలుగా హర్యానా ప్రభుత్వం నీటి సరఫరాను తగ్గించి 100 MGD తక్కువ నీరు ఇస్తోందన్నారు. నిన్న తన ఆరోగ్యాన్ని పరిశీలించిన డాక్టర్లు నిరాహార దీక్ష కొనసాగిస్తే తన ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెప్పారన్నా రు. తన ఆరోగ్యం ఎంత క్షీణించినా, ఢిల్లీ వాసులకు మంచి జరిగే వరకు తన నిరవధిక దీక్ష కొనసాగుతుందని అతిషి స్పష్టం చేశారు.