బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దొంగ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ సమాజానికి పూర్తిగా స్పష్టత వచ్చిందన్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని ఆరోపించారు.కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి …కేసీఆర్ కూతురు బెయిల్ కోసం వాదనలు వినిపించిన వ్యక్తి.. కేసీఆర్ సూచనల మేరకే ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించారని అన్న్నారు. బీఆర్ఎస్ రాజ్యసభకు ఎందుకు పోటీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.