టాలీవుడ్‌లో మెగా వర్సెస్ అల్లు ఎపిసోడ్ మరింత రచ్చ రేపుతోంది. మెగా కాంపౌండ్‌కు బీటలువారనుందా అన్న అనుమానం తలెత్తేలా కోల్డ్ వార్ నడుస్తోంది. అవకాశమేదైనా అందిపుచ్చుకుని మరీ పోటాపోటీగా సెటైర్లు వేస్తూ థియేటర్లో వేసే పంచ్ డైలాగ్‌లను మూవీ ఈవెంట్‌లలో పేలుస్తున్నారు. దీంతో ఇటు మెగా ఫ్యాన్స్, అటు అల్లు ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ నెట్టింట కామెంట్లతో దాడికి దిగుతున్నారు. ఇదిలా ఉంటే.. మరికొద్ది రోజల్లోనే అంటే.. డిసెంబర్ 5న పుష్ప 2 మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ వివాదం కాస్తా అటు సినిమా వసూళ్ల మీద ప్రభావం పడే అవకాశముండటంతో చిత్ర బృందం వివాదాన్ని సద్దుమణిగించే వ్యూహంలో ఉంది.
ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌తో భేటీకి సన్నాహాలు జరుపుతోంది. ఈ క్రమంలోనే త్వరలోనే వీరిద్దరి భేటీ జరగనుంది. ఈ సమావేశంలో మూవీ మేకర్స్ కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. పుష్ప మూవీ టికెట్స్‌పై చర్చించనుంది ఈ బృందం. అయితే,.. ఈ భేటీతో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్‌కు తెరపడే అవకాశముందని… అలాగే పుష్ప 2 మూవీ కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.