ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో పలువురు కూటమి నేతలతో కలిసి సిటీ ఎమ్మెల్యే వాసు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజశేఖరానికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే పట్టభద్రుల ప్రయోజనాలు కాపాడతారన్నారు. నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఏడేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులు, పలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.