ఒకే స్కూలులో చదువుకున్న పూర్వ విద్యార్థులు దశాబ్దాల తర్వాత కలిస్తే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. అటువంటి ఆత్మీయ సమ్మేళనమే హైదరాబాద్ లోని వనస్థలిపురంలో జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా తాడురు మండలం మేడిపూర్ గ్రామంలోని U.P.S స్కూల్ 1984-85 బ్యాచ్ కి చెందిన ఏడో తరగతి పూర్వ విద్యార్థులు మళ్లీ ఇప్పుడు ఒకచోట కలిశారు. వనస్థలిపురంలో జరిగిన ఈ గెట్ టు గెదర్ లో పూర్వ విద్యార్థి అయిన స్థానిక కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
దాదాపు 38 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరం ఒకచోట కలుసుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుత బిజీ లైఫ్ లో అనేక ఒత్తిడుల మధ్య ఉండే అందరం ఇలా కలుసుకుని చిన్ననాటి విషయాలను జ్ఞాపకాలు తెచ్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా బాల్యంలో స్నేహితులతో గడిపిన మధుర స్మృతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.