ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో భారీ చోరీ జరిగింది. ఆకులవారిఘణపురం కాలనీలో నాగేశ్వరరావు అనే పోస్టాఫీస్ ఉద్యోగి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఏడు నెలల కాల వ్యవధిలో ఒకే ఇంట్లో చోరీ జరగగా… నెల వ్యవధిలో కాలనీలో మూడు సార్లు చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వెండి, నగదు అపహరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.


