స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. హైదరాబాద్‌కు చెందిన రాకేష్ నుంచి రూ.2 కోట్లవరకు ఉడాయించారు కేటుగాళ్లు. క్రిప్టోలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ ప్రచారం చేశారు. దీంతో రూ.2 కోట్లు పెట్టుబడులు పెట్టి రాకేష్ అనేవ్యక్తి మోసపోయాడు.. క్రిప్టులో పెట్టుబడులు పెడితే రూ.కోటికి రూ.10 కోట్లు వస్తాయని కేటుగాళ్లు నమ్మించడంతో మోసపోయానని రాకేష్ తెలుపుతున్నాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికి వచ్చింది.