Tirupati | తిరుపతి గాజులమండ్యంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని మల్లాడి డ్రగ్స్ కంపెనీ సాల్వెంట్ ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకొని మంటలను ఆర్పివేసే పనిలోపడ్డాయి. ఈ ప్రమాదంలో చిక్కుకున్న సాయి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.చివరకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరగటానికి గల కారణం తెలియాల్సి ఉంది.