Mavoist Encounter | జార్ఖండ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ ఏకంగా ఐదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జార్ఖండ్ లోని చిత్ర జిల్లా సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరణించిన ఇద్దరు మావోయిస్టులపై పోలీసులు 25 లక్షలు రివార్డులు ప్రకటించారు. అలాగే మరో ముగ్గురు పై ఐదు లక్షల రూపాయల రివార్డులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఘటనా స్థలం నుండి రెండు ఏకే 47 తుపాకులను అధికారులు స్వాధీన పర్చుకున్నారు. కాగా, ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్ర నాయకుడు చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.