యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. ఎంటర్‌టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. “రామన్న యూత్” సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 11న సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ ఫంక్షన్‌కు అతిథిగా హాజరుకానున్నారు.
“రామన్న యూత్” సినిమా నుంచి రీసెంట్‌గా హీరో సిద్ధార్థ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “రామన్న యూత్” సినిమా కూడా బలగం లాగా ఆకట్టుకుంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 15న “రామన్న యూత్” సినిమా థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు :
అభయ్ నవీన్, అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు పొలసాని తదితరులు.
సాంకేతిక నిపుణులు :
కాస్ట్యూమ్ డిజైనర్ – అశ్వంత్ బైరి, ప్రతిభ రెడ్డి
సౌండ్ డిజైన్ – నాగార్జున తాళ్లపల్లి
ఎడిటర్ – రూపక్ రొనాల్డ్ సన్, అభయ్ నవీన్
ఆర్ట్ – లక్ష్మీ సింధూజ
సంగీతం – కమ్రాన్
సినిమాటోగ్రఫీ – ఫహాద్ అబ్దుల్ మజీద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ ఎంఎస్ కే
పీఆర్వో – జీఎస్ కే మీడియా
రచన దర్శకత్వం – అభయ్ నవీన్.