- ఈనెల 20న లడాఖ్‌లోని మారథాన్‌లో పాల్గొననున్న 75 మంది అథ్లెట్లు
- భారత్‌లో తొలిసారి ఘనీభవించిన సరస్సుపై అథ్లెట్ల పరుగులు
నగరాలు, పట్టణాల్లో ప్రతి వీకెండ్ మారథాన్‌లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. అయితే.. జమ్మూ, కాశ్మీర్ లో ఈనెల 20న ఒక వినూత్న మారధాన్ జరగబోతోంది. ఇక్కడ మారథాన్ అంటే రోడ్లపై పరుగులు తీయడం కాదు. ఘనీభవించి సరస్సుపై పరుగులు తీయాల్సి ఉంటుంది. లడాఖ్ లోని పాంగాంగ్ సరోవరంలో ఈ మారథాన్ నిర్వహిస్తారు. భారత్‌లో ఈ తరహా మారథాన్ నిర్వహించడం ఇదే తొలిసారి. 13,862 అడుగుల ఎత్తున్న ఈ సరస్సు దాదాపు 700 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ మైనస్ 30 డిగ్రీల సెల్షియస్ టెంపరేచర్ ఉంది.
లడాఖ్ మారథాన్‌లో 75 మంది స్వదేశీ, విదేశీ అథ్లెట్లు పాల్గొంటారు. వాతావరణ మార్పులను ప్రపంచం దృష్టికి తీసుకురావడమే లడాఖ్ మారథాన్ లక్ష్యం అంటున్నారు నిర్వాహకులు. ఈ మారథాన్‌కు.. లాస్ట్ రన్ అని పేరుపెట్టారు. లాస్ట్ రన్ మారధాన్‌తో లడాఖ్ ప్రాంతంలో టూరిజం పెరిగే అవకాశాలున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.