టీడీపీ జనసేన ఉమ్మడి సీట్ల కేటాయింపుపై పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. జగ్గంపేట జనసేన పార్టీ ఇన్‌చార్జి సూర్యచంద్ర టికెట్ దక్కకపోవడంతో మనస్తాపంతో అచ్యుతాపురం దుర్గాదేవి ఆలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. పవన్ కల్యాణ్ స్పందించి న్యాయం చేసేవరకు ప్రాణం పోయినా ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని ప్రకటించారు. తన తుదిశ్వాస వరకు జనసేనలోనే ఉంటానని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసినా పార్టీ గుర్తించలేదని సూర్య చంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.


