Manchu Manoj |సినీ నటుడు మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి వివాహబంధంతో ఒక్కటయ్యారు. జూబ్లిహిల్స్ ఫిలిం నగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి సరిగ్గా 8గంటల30 నిమిషాలకు మనోజ్ మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు. వేద మంత్రాల సాక్షిగా జరిగిన ఈ వివాహ వేడుకకు రెండు కుటుంబాలకు చెందిన కొంతమంది బంధువులు.. సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరై నూతన వధూవరులు ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకకు మోహన్ బాబు దంపతులు, మంచు లక్ష్మీ, మంచు విష్ణు, వైఎస్ విజయమ్మ, టీజీ వెంకటేశ్, కోదండరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, దేవినేని అవినాష్ తదితరులు హాజరయ్యారు. మనోజ్, మౌనికల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.