19.7 C
Hyderabad
Wednesday, December 3, 2025
spot_img

మమ్ముట్టి ‘భ్రమయుగం’ షూటింగ్ స్టార్ట్

ప్రత్యేకంగా హారర్- థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికి నిర్మాత చక్రవర్తి రామచంద్ర స్థాపించిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఈరోజు (ఆగస్టు 17న) ప్రారంభమైంది.నైట్ షిఫ్ట్ స్టూడియోస్‌ని ఈరోజు ఉదయం ప్రారంభించారు. ప్రారంభ సమయంలోనే తాము నిర్మించబోయే మొదటి సినిమాని ఈరోజే పక్రటిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. చెప్పినట్లుగానే మొదటిచిత్రాన్ని ఘనంగా పక్రటించారు.

నైట్ షిఫ్ట్ స్టూడియోస్ నిర్మిస్తున్న మొదటి చిత్రం ‘ భ్రమయుగం’లో ప్రముఖ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. రాహుల్ సదాశివన్ రచన-దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

చిత్ర ప్రకటన సందర్భంగా ప్రముఖ నటుడు మమ్ముట్టి మాట్లాడుతూ.. “#NS1 ఒక ఉత్తేజకరమైన చిత్రం. నేను మునుపెన్నడూ చేయని పాత్రను పోషిస్తున్నందున ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దర్శకుడు రాహుల్ అద్భుత ప్రతిభ, నిర్మాతలు రామ్-శశిల అభిరుచి ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకం చేశాయి.” అన్నారు.

రచయిత, దర్శకుడు రాహుల్ సదాశివన్ మాట్లాడుతూ.. “మమ్ము ట్టిగారి సినిమాకిదర్శకత్వం వహించాలనే కలను సాకారం చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ‘భ్రమయుగం’ అనేది కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగేకథ. దీనిని అద్భు తంగా మలచడానికి నిర్మా తల సహకారం లభించినందుకు సంతోషిస్తున్నా ను. పప్రంచవ్యా ప్తంగా ఉన్న మమ్ము క్కా
అభిమానులకు మరియు ఈ జానర్ ని ఇష్టపడేవారికి ఇది ఒక ట్రీట్ అవుతుందని ఆశిస్తున్నా ను.” అన్నా రు.

రామచంద్ర 2016 లో వైనాట్ స్టూడియోస్ లో చేరే వరకు ఒక దశాబ్దం పాటు సొంతంగా చిత్ర నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు వైనాట్ స్టూడియోస్ వ్యవస్థాపకుడు, నిర్మాత ఎస్.శశికాంత్ భాగస్వామ్యంతో చిత్ర నిర్మాణ రంగంలో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. గత ఏడు సంవత్సరాలుగా శశికాంత్ రామచంద్ర పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.నైట్ షిఫ్ట్ స్టూడియోస్ వ్యవస్థాపకుడు, నిర్మాత చక్రవర్తి రామచంద్ర మాట్లాడుతూ.. ” హారర్ జానర్‌పై నాకున్న అభిరుచి, రిచ్ కంటెంట్ మరియు ప్రతిభావంతులైన ఫిల్మ్‌మేకర్‌లతో సంవత్సరాల తరబడి పనిచేసిన అనుభవం, ప్రపంచస్థాయి చిత్రాలను రూపొందించాలనే తపనతో ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.” అన్నారు.

నిర్మా తలు చక్రవర్తి రామచంద,ఎస్. శశికాంత్ మాట్లాడుతూ.. “మా సంస్థలో మొదటిసినిమానే లెజెండరీ నటుడు మమ్ముక్కా (మమ్ముట్టి)తో చేసేఅవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాము. మమ్ముక్కా అసమానమైన ఇమేజ్‌తో ఈ చిత్రం మరో స్థాయికి వెళ్తుంది.‘ భ్రమయుగం’’ అనేది ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి మా దర్శకుడు రాహుల్ సృష్టించిన అద్భుత పప్రంచం” అన్నారు.

‘భ్రమయుగం’’ చిత్రాన్ని కొచ్చి, ఒట్టపాలంలో భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్డా లిజ్ ఇతర ముఖ్య పాతల్రు పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా షెహనాద్ జలాల్, ప్రొడక్షన్ డిజైనర్‌గా జోతిష్ శంకర్, ఎడిటర్గా షఫీక్ మహమ్మద్ అలీ, సంగీత దర్శకుడిగా జేవియర్ వ్యవహరిస్తున్నారు. టిడిరామకృష్ణన్ డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి మేకప్ రోనెక్స్ జేవియర్, కాస్ట్యూ మ్స్ మెల్వీ జె. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సమర్పిస్తున్న ‘ భ్రమయుగం’ 2024 ప్రారంభంలో పప్రంచవ్యాప్తంగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీభాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్