స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పాతకాలంలో చిన్నపిల్లలు ఏడుస్తుంటే వారిని బుజ్జగించడానికి తల్లులు జోలపాటలు పాడేవారు. ప్రస్తుతం అలా పాడడం మానేసి పిల్లలు ఏడుస్తుంటే ఫోన్లలో గేమ్స్ లేదా పాటలు పెడుతున్నారు. ఫోన్ తీసుకోగానే పిల్లలు మళ్లీ ఏడుస్తున్నారు. ఏంచేస్తాం ఈకాలం తల్లిదండ్రులు పిల్లలను అలా తయారుచేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఓ తండ్రి అమ్మలాగా జోలపాట పాడి తన పాపను లాలించిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో చోటుచేసుకుంది.
వరంగల్ కు చెందిన లక్ష్మీనారాయణ చారి అనే లెక్చరర్ కరీంనగర్ డైట్ కాలేజీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అతనికి మూడు నెలల పాప ఉండడంతో తనతో పాటు కాలేజీకి తీసుకువచ్చాడు. ఒక్కసారిగా పాప ఏడవడంతో చిన్నారిని లాలిస్తూ జోలపాట పాడాడు. పాపను ఓదారుస్తూ ఆయన పాడిన పాటను తోటి లెక్చరర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. సార్ పాట విన్న నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.