కేసీఆర్, కేటీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. పదేళ్లలో మీరు తెచ్చిన పెట్టుబడులు ఎంత అని ప్రశ్నించారు. పెట్టుబడుల విషయంలో తాము చర్చకు సిద్ధమన్నారు. ఎంవోయూలను లెక్కలతో సహా చూపిస్తామని చెప్పారు. లక్షా 78 వేల కోట్ల పెట్టుబడులు వస్తుంటే.. చౌకబారు విమర్శలు చేస్తున్నా మండిపడ్డారు. పదేళ్లలో 7లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. 2017 నుంచి 2019 వరకు రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు సున్నా అని దుయ్యబట్టారు. దావోస్‌లో తెలంగాణ పెవిలియర్ దగ్గర.. పెట్టుబడుల కోసం కంపెనీలు క్యూకట్టాయని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.