స్వతంత్ర వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ – త్రివిక్రమ్ టైటిల్‌తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. రీసెంట్‌గా రిలీజ్ అయిన మహేష్ బాబు ప్రీ లుక్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్.
ఇవాళ కృష్ణ పుట్టిన రోజు స్పెషల్‌గా.. మహేష్ , త్రివిక్రమ్ సినిమా నుంచి టైటిల్‌ను,
పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో మహేష్ ప్రీ లుక్స్‌ను రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. మహేష్ తలకు గుడ్డ కట్టుకుంటూ.. విలన్స్‌పై ఫైట్‌కు రెడీ అవుతున్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ఈ రోజు చాలా స్పెషల్స్ ఉన్నాయి.. ఇది మీకోసం నాన్న అంటూ తన కొత్త మూవీ పోస్టర్‌ను షేర్ చేశారు మహేష్. ఈ మాస్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. నెట్టింట వైరల్ అవుతోంది ఈ పోస్టర్.