తన్విక అండ్ మొక్షిక క్రియేషన్స్ పతాకంపై నూతన తారలు రవితేజ నున్న హీరోగా, నేహ జురెల్ హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం ‘రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి’. సత్య రాజ్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి నిర్మాతలు రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు. ఈ చిత్రం నుంచి ‘ఐ లవ్ యు’ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. రెహమాన్ రచించిన ఈ చిత్ర గీతాన్ని యాజిన్ నిజర్, నూతన్ మోహన్ పాడారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం చేయటం విశేషం. హీరోహీరోయిన్ల ప్రేమను తెలియజేస్తూ చిత్రీకరించిన ఈ పాట యువతను ఆకట్టుకుంటుంది.
ఇంతకు ముందు విడుదలైన రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి టీజర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులలో ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేయడానికి ఈ చిత్రం ట్రైలర్‌ను త్వరలో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం కొద్ది రోజులలో థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
తారాగణం:
కథానాయకుడు: రవితేజ నున్నా
కథానాయిక: నేహా జురెల్
ఇతర ప్రధాన పాత్రలలో నాగినీడు,ప్రమోదిని
జబర్దస్త్ బాబీ,జబర్దస్త్ అశోక్, పుష్ప దుర్గాజి
యోగి ఖత్రి , అజిజ్ భాయ్, వీరేంద్ర
గిద్ద మోహన్, అప్పిరెడ్డి, కంచిపల్లి అబ్బులు
శ్రావణి
సాంకేతిక బృందం:
సంగీతం: రోషన్ సాలూరి
ఛాయాగ్రహణం: మురళి కృష్ణ వర్మ
కూర్పు: కిషోర్ టి
దర్శకత్వం: సత్య రాజ్
నిర్మాతలు: రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాస్