లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బ్యాటింగ్ కు దిగిన బ్యాటర్లందరూ రెచ్చిపోవడంతో ఈ ఐపీఎల్ సీజన్లోనే అత్యధిక స్కోర్ నమోదైంది. 20ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసి ఔరా అనిపించారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ తక్కువ స్కోర్ కే వెనుదిరిగినా.. కైల్ మేయర్స్(54), అయూష్ బదానీ(43) పరుగులతో అదరగొట్టారు. అనంతరం వచ్చిన మార్కస్ స్టాయినిస్ అయితే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 40 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. ఇక చివర్లో నికోలస్ పూరన్ 19 బంతుల్లో 45 పరుగులతో దుమ్మురేపాడు. లక్నో బ్యాటర్ల దెబ్బకు పంజాబ్ బౌలర్లు తేలిపోయారు. 14 సిక్సులు, 27ఫోర్లతో బౌలర్లపై వీరవిహారం చేశారు. ఇంత భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఛేజ్ చేస్తుందో లేదో చూడాలి మరి.