27.2 C
Hyderabad
Monday, January 13, 2025
spot_img

తెలుగు రాష్ట్రాల్లో లారీల బీభత్సం

స్వతంత్ర వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా కొణిజర్లలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొణిజర్ల నుంచి వైరా వెళ్తుండగా ఎదురుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో వెనక వెళ్తున్న కారు లారీ వెనక భాగాన్ని ఢీకొంది. అదే సమయంలో వెనకాల వస్తున్న మరో లారీ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు వైరా మండలం విప్పలమడక వాసులైన రాజేశ్‌, సుజాత దంపతులు, వారి కుమారుడు ఆశ్రిత్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్న రాజేష్.. వైరా మండలం విప్పలమడక.. స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మరికాసేపట్లో ఇంటికి చేరుతారనగా మృత్యువు కబళించింది. దీంతో విప్పలమడకలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరో ఘటనలో జిల్లాలోని పెనుబల్లి వీఎం బంజర జరిగింది. బంజర సమీపంలో రెండు లారీలు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఎదురుగా వస్తున్న లారీని మరో లారీ ఢీ కొట్టింది. దీంతో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. వాటిలో రెండు లారీల డ్రైవర్లిద్దరూ ఇరుక్కుపోయారు. బయటికి రాలేక, ఊపిరి ఆడక రెండు గంటలపాటు నరకం చూశారు. పోలీసులు.. రెస్క్యూ టీం సాయంతో వారిని రెండుగంటల తరువాత బైటికి తీశారు. కానీ తీవ్రంగా గాయపడడం, ఊపిరిఆడకపోవడంతో బైటికి తీసిన కాసేపటికే వీరిద్దరూ మృతి చెందారు.

మూడో ఘటన కల్లూరు మండలం రంగంబంజరలో చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయితేజ అనే యువకుడు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు మృతిచెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లె వాసులుగా గుర్తించారు. ఘటనాస్థలంలో ఏర్పేడు సీఐ శ్రీహరి, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. లారీలు యమపాశాలుగా మారడంతో నాలుగు ఘటనల్లో మొత్తం 9మంది మరణించారు.

Latest Articles

జమ్ముకశ్మీర్‌లో జడ్‌-మోడ్‌ సొరంగం.. సైన్యానికి కీలకం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్ముకశ్మీర్‌ గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్‌-మోడ్‌ సొరంగాన్ని ప్రారంభించారు. అనంతరం టన్నెల్‌ లోపలికి వెళ్లి పరిశీలించారు. శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిపై సోన్‌మార్గ్‌ ప్రాంతంలో రూ.2,700 కోట్లతో జడ్‌-మోడ్‌ టన్నెల్‌ను నిర్మించారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్