స్వతంత్ర వెబ్ డెస్క్: ‘లియో’(Leo) ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఓ ఇంటర్వ్యూలో తాను ప్రభాస్ తో చేయబోయే మూవీ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్(LCU) లో భాగం కాదని స్పష్టం చేశారు.
ప్రస్తుత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) గురించే డిస్కషన్ నడుస్తోంది. అందుకు కారణం దళపతి విజయ్ (Vijay)తో లోకేష్ తెరకెక్కించిన తాజా మూవీ ‘లియో'(Leo)నే. ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. రిలీజ్ టైం దగ్గర పడడంతో లోకేష్ కోలీవుడ్లో(Kollywood) వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ‘లియో’ మూవీతో పాటు తన తదుపరి చిత్రాలకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వడంతో ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
10 చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించి సినీ పరిశ్రమకు గుడ్‍బై చెబుతానని తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) గతంలో ప్రకటించారు. దళపతి విజయ్ హీరోగా లోకేశ్ దర్శకత్వం వహించిన లియో సినిమా లోకేశ్‍కు ఐదో సినిమాగా ఉంది. లియో(Leo) మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. అయితే, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‍తో లోకేశ్ చేయనున్న సినిమా గురించి కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు లోకేశ్ కనగరాజ్. లియో ప్రోమోషన్లలో ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు.
ప్రభాస్‍తో లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) చేసే సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)కు ఎండ్ గేమ్‌గా ఉంటుందని కొంతకాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై లోకేశ్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్(Prabhas)తో తాను చేసే సినిమా ఎల్‍సీయూ(LCU)లో భాగం కానేకాదని అన్నారు. ఆ చిత్రం స్టాండలోన్‍గా ప్రత్యేకంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. తన గత సినిమాలకు, ప్రభాస్‍తో చేసే చిత్రానికి సంబంధం ఉండదని లోకేశ్ స్పష్టం చేశారు.
తన గత చిత్రాలకు లింక్ చేస్తూ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)ను లోకేశ్ సృష్టించారు. ఖైదీ(Khaidi), విక్రమ్(Vikram) చిత్రాలకు లింక్ పెట్టారు. అలాగే, లియో కూడా ఎల్‍సీయూలో భాగమేనని తెలుస్తున్నా.. ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, ఎల్‌సీయూ ముగింపు గురించి కూడా లోకేశ్ చెప్పారు. కమల్ హాసన్‍తో చేసే విక్రమ్ 2(Vikram2) సినిమాతోనే ఎల్‍సీయూ ముగుస్తుందని చెప్పేశారు.
ఇక ఈ మూవీ తరువాత లోకేష్ లైనప్ ఏంటని అడగగా, దర్శకుడు బదులిస్తూ.. రజినీకాంత్‌తో తలైవర్171 (Thalaivar 171), కార్తితో ఖైదీ-2, సూర్యతో రోలెక్స్(Rolex) కమల్‌తో విక్రమ్-2 అని తెలియజేశాడు. కాగా లోకేష్, రజినితో తెరకెక్కించే తలైవర్171ని వచ్చే ఏడాది సమ్మర్ లో సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నాడట. లియో రిలీజ్ అయిన తరువాత ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తానని తెలియజేశాడు.ప్రభాస్ యాక్టింగ్, లోకేశ్ డైరెక్షన్ కలిస్తే.. ఆ చిత్రం అద్భుతంగా ఉంటుందని అభిమానులు ఇప్పుడే సంతోషిస్తున్నారు. అయితే, ప్రభాస్(Prabhas) – లోకేశ్(Lokesh) ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు మరో రెండేళ్ల సమయమైనా పట్టే అవకాశం ఉంది.
ప్రభాస్ హీరోగా నటించిన సలార్ పార్ట్ 1: సీజ్‍ఫైర్ సినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ సినిమా చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్‍తో పాటు డైరెక్టర్ మారుతీతోనూ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారు. సలార్ రెండో భాగం కూడా ఉండనుంది.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమా మరో మూడు రోజుల్లో అంటే అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.ఎస్ లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‍గా చేయగా.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautham Vasudev Menon) కీలకపాత్రలు పోషించారు.


