24.7 C
Hyderabad
Thursday, June 13, 2024
spot_img

లోక్‌సభ ఎన్నికలు.. మొదటి విడత జరిగే రాష్ట్రాలు

లోకసభ ఎన్నికలు తరుముకువస్తున్నాయి. ఈనెల 19న మొదటి విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. తొలిదశలో మొత్తం 102 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. తొలివిడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. అలాగే అసోం, అరుణాచల్ ప్రదేశ్ లో రెండేసి స్థానాలకు, చత్తీస్ గఢ్ లో ఒక స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. మధ్యప్రదేశ్ లో ఆరు సెగ్మెంట్లకు మహారాష్ట్రలో ఐదు నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. వీటితో పాటు బీహార్‌లో నాలుగు నియోజకవర్గాలకు మణిపూర్, మేఘాలయలో రెండు సెగ్మెంట్లకు, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో ఒక్కో నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. అంతేకాదు రాజస్థాన్ లో 12 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది సెగ్మెంట్లకు , ఉత్తరాఖండ్ లో ఐదు నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్‌లో మూడు సెగ్మెంట్లకు పోలింగ్ జరుగుతుంది. వీటితో పాటు పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో కూడా తొలిదశలో భాగంగా కొన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది.

దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడులోని మొత్తం 39 నియోజవర్గాల్లో ఈనెల 19న ఒకేదఫా ఎన్నికలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు కావడం విశేషం. తమిళనాడు రాజకీయాలు ఈసారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సహజంగా తమిళనాట ఎప్పుడూ ఎన్నికల గోదాలో రెండు శిబిరాలే తలపడతాయి. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మూడు కూటములు బరిలో ఉన్నాయి. ఇందులో మొదటిది డీఎంకే – కాంగ్రెస్ కూటమి. డీఎంకే ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉంది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమిలో కూడా డీఎంకే కూడా భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో డీఎంకే సాయంతో తమిళనాడులో కొన్ని సీట్లు అయినా సునాయాసంగా గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

2019లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే నాయకత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 38 సీట్లను గెలుచుకుంది. దీంతో ఈసారి కూడా మెజారిటీ సీట్లు తమవే అంటూ ధీమా వ్యక్తం చేశారు డీఎంకే నేతలు. పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకేకు కేవలం ఒకే ఒక్క సీటు దక్కింది.కాగా ఈసారి డీఎంకే 21 సీట్లలో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు తొమ్మిది సీట్లు కేటాయించారు. మిగతా రాజకీయపార్టీలకు ఒక్కో సీటు కేటాయించారు. తాజాగా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి డీఎంకే మేనిఫోస్టోను కూడా ప్రకటించింది.

మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకే కూడా లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంది. కాగా అన్నాడీఎంకేతో తాజాగా సినీ నటుడు విజయ్‌కాంత్ నాయకత్వంలోని డీఎండీకే జత కట్టింది. డీఎండీకే కు ఐదు సీట్లు ఇవ్వడానికి పళనిస్వామి అంగీకరించారు. అలాగే ఎస్డీపీఐ, పుదియ తమిళగం పార్టీలకు ఒక్కో సీటు కేటాయించారు పళనిస్వామి. ఇదిలా ఉంటే మజ్లిస్ పార్టీతో అన్నా డీఎంకే తాజాగా పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తుతో ముస్లిం మైనారిటీలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని అన్నాడీఎంకే భావిస్తోంది. కాగా భారతీయ జనతా పార్టీ 19 స్థానాలకు పోటీ చేస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్బుమణి పట్టాళి మక్కళ్ మున్నేట్ర కజగం పది సెగ్మెంట్లలో పోటీ చేస్తోంది. అలాగే పొత్తులో ఉన్న చిన్న పార్టీలకు ఒకట్రెండు సీట్ల చొప్పున బీజేపీ కేటాయించింది.

తమిళనాడులో నిన్నమొన్నటివరకు భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉండేదికాదు. ఒకసారి డీఎంకేతో మరోసారి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటూ కాలం గడిపేసింది కమలం పార్టీ. అయితే తాజాగా తమిళనాట బీజేపీకి ఊపిరులూదిన నాయకుడు అన్నామలై అనే చెప్పాలి. అన్నామలై గతంలో ఐపీఎస్ అధికారి. సమర్థుడైన పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. తమిళనాట బీజేపీకి దిక్కుమొక్కులేని రోజుల్లో 2021 జులైలో పార్టీ రాష్ట్ర బాధ్యతలు అన్నామలైకు అప్పగించారు హస్తిన పెద్దలు. అన్నామలై పగ్గాలు చేపట్టిన తరువాత తమిళనాడు బీజేపీలో జోష్ పెరిగిన మాట వాస్తవం. తమిళనాట కొన్ని దశాబ్దాలుగా ఏదో ఒక ద్రవిడ పార్టీకి జూనియర్ పార్టీగా ఉన్న బీజేపీని ఒక స్వతంత్ర రాజకీయపార్టీగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి తీసుకెళ్లిన ఘనత నిస్సందేహంగా అన్నామలైదే. ఎంకే స్టాలిన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిరోజూ ఏదో ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి బీజేపీని జనంలోకి తీసుకెళ్లాడు అన్నామలై.

తమిళనాడులో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం హోరెత్తించారు. దశాబ్దాల నాటి కచ్చతీవు దీవిని ప్రచారాస్త్రాంగా చేసుకున్నారు. మన భూభాగంలో భాగమైన కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేసి తమిళుల ప్రయోజనాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని మండిపడ్డారు. తూత్తుకుడిలో భారీ సభ నిర్వహించి తమిళనాడుకు వరాలు ప్రకటించారు. ఇదిలా ఉంటే తమిళభాషకు ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సాహం ఇస్తామని కమలం పార్టీ తాజా మేనిఫెస్టోలో పేర్కొంది. మొత్తం మీద డీఎంకే – కాంగ్రెస్ కూటమిని టార్గెట్‌ చేసుకుని ప్రచారం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

Latest Articles

‘పద్మవ్యూహంలో చక్రధారి’ ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. ఓ. రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పద్మహ్యూహంలో చక్రధారి. ప్రవీణ్‌రాజ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. మాస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్