స్థానిక ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో హామీల అమలుకు ముందడుగు వేయాలని తెలిపారు. అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం చేసే బాద్యత ఎమ్మెల్యేలదే అని తేల్చి చెప్పారు. సీసీ రోడ్లు, ఆలయాలు, నిర్మాణ అనుమతులకు.. నిధుల మంజూరు కోసం మంత్రులను కలవాలని అన్నారు. నిధుల మంజూరు కోసం మంత్రులను కలవాలని చెప్పారు. బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల పదవులను కేటాయించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.