28.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

ఒత్తిడిని చిత్తు చేసేద్దామిలా..!

ఒత్తిడి అనేది ఈ రోజుల్లో సర్వ సాధారణమయిన విషయంగా మారింది. ఆఫీసులోని పని , ఇంట్లో సమస్యలు, పిల్లల చదువులు, ఆర్ధిక ఇబ్బందులు ఇలా ఆడా మగా తేడా లేకుండా ఏదో ఒక కారణంతో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. నిజానికి ఒత్తిడి ఎంత పెద్ద భూతం అంటే అది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పీల్చి పిప్పి చేస్తుంది. చిన్నపాటి ఇబ్బందే కదా అని వదిలేస్తే అది ఏకంగా కొత్త కొత్త రోగాలు, సమస్యలు తెచ్చిపెడుతోంది. మనిషినే కబళిస్తోంది. జీవితాన్ని హరిస్తోంది.

అసలు ఒత్తిడి కలగడానికి కారణం ఏంటా అని చేసిన సర్వేలో తెలుసుకున్న ముఖ్య విషయం ఏంటి అంటే ఈ సమస్యకు మన జీవన శైలే ప్రధాన కారణమట. ఉదయం లేస్తూనే ఉరుకులు , పరుగులు. గబగబా ఏదో తిన్నాం అనిపించి ఎవరి పనులకు వారు వెళ్ళిపోవడమే. ఆఫీసు పనులు, ఆర్ధిక ఇబ్బందులు, పిల్లలు, స్కూళ్లు , ఒక్కో మనిషి ఒకేసారి రెండు మూడు పనులు చేయాల్సినంత బిజీ, ఏం తిన్నామో తెలియనంత బిజీ. ఇదంతా మనల్ని శారీరకంగా, మానసికంగా కుంగదీసి అతి పెద్ద సమస్యకు దారి తీస్తోంది.

నిజానికి ఒత్తిడికి లోనవటం వల్ల మనకు తెలియకుండానే రకరకాల ఆరోగ్య సమస్యలు మనపై దాడి చేస్తున్నాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు మన నాడీ వ్యవస్థ పై ప్రభావం కార్టిసాల్, అడ్రినలిన్ అధికంగా ఉత్పత్తి అవుతాయి. అనారోగ్యం పాలు చేస్తాయి. ఒత్తిడి అనే ఈ మూడక్షరాల పదం చెట్టంత మనిషిని కూడా కుదేలయ్యేలా చేస్తుంది. పొట్ట నిండా తినలేరు, కంటి నిండా నిద్రిపోలేరు. మంచి ఉద్యోగం, హోదా సంపాదన, మంచి ఫ్యామిలీ ఎన్ని ఉన్నా ఏదో ఒక బెంగతో ఇబ్బంది పడిపోతారు.

నిజానికి ఉన్నదానితో తృప్తి పడలేక పోవడమే ఒత్తిడికి ఒక కారణం. అలాగే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కూడా చివరి నిమిషంలో ఒత్తిడికి గురవుతాం. మహిళలకు అయితే ఇంట్లో పని, ఆఫీసులో పని , వీటితో పాటూ కుటుంబ సభ్యులా సహకారం లేకపోవటం కారణంగా చాలా ఒత్తిడిగా ఉంటుంది. ఇక పురుషులలో ఒత్తిడికి ఆర్ధిక కారణాలు, కుటుంబ సమస్యలు వంటి కారణాలు కూడా ఉంటాయి. జీవితంలో ఒక్కసారిగా జరిగే పెనుమార్పులు , సంఘటనలు మితిమీరిన అంచనాలు , ప్రతీది పక్కాగా జరగాలి అని అనుకోవడం, అతిగా పట్టించుకోవడం లాంటివి మనల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. అసలు ఒత్తిడి కలగడానికి ప్రధాన కారణం మన ఆలోచనా ధోరణి. నిరాశ, అకారణ భయం కూడా ఒత్తిడికి కారణం అవుతాయి.

ఒత్తిడి వల్ల కలిగే మొదటి అనారోగ్యం జీర్ణవ్యవస్థ దెబ్బ తినటం. దీంతో రక్తపోటు పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మధుమేహానికి దారితీస్తుంది. ఒత్తిడి వల్ల గ్లూకో కార్తికాయిడ్స్ అనే హార్మోన్స్ ఉత్పన్నమవుతాయి. అలాగే ప్యాంక్రియాస్ గ్లూకోగాన్ రిలీజ్ చేస్తుంది. ఒత్తిడి వల్ల పెరిగిన గ్లూకోజ్ షుగర్ ని పెంచుతుంది. మరోవైపు పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఒత్తిడి ప్రభావం గుండెపై పడితే హార్ట్ బీట్ పెరుగుతుంది. హృదయ సంబంధిత వ్యాధులు వస్తాయి. అలాగే కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, తలనొప్పి, కిడ్నీ ఫెయిల్యూర్స్, బ్రెయిన్ హేమరేజ్ వచ్చేస్తాయి. ఒత్తిడి పెరిగితే నిద్రలేమి స్టార్ట్ అవుతుంది. అది కూడా తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుంది

శరీరంపై ప్రభావం చూపే ఒత్తిడి మనసుపై కూడా తన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆలోచనలు, భావాలు, ప్రవర్తనలు ప్రభావితమవుతాయి. ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకోగలగడమే ఒత్తిడి నియంత్రణ. మానసిక ఆరోగ్యం కోసం ఒత్తిడిని తగ్గించే మందులు వేసుకోవడం కంటే ఒత్తిడిని నేచురల్‌గా తగ్గించుకోవడమే మంచిది.

ఒత్తిడి లేకుండా ఉండడం చాలా కష్టం. ప్రతి మనిషి ఒత్తిడితోనే జీవించాలి. ఒత్తిడి కూడా మనకు కొంత మంచే చేస్తుంది. జీవితంలో నిత్యం జరిగే ఆటుపోటులను తట్టుకోవడానికి కొంత ఒత్తిడి అవసరమే. అది ఉన్నప్పుడే మనం చేయాలని అనుకునే పని సకాలంలో ముగించేస్తాము. కానీ ఆ ఒత్తిడి పాజిటివ్ గా ఉండాలి. అధిక ఒత్తిడి మనిషిని అనారోగ్యాల పాలు చేస్తుంది.

ఆరోగ్యకరమైన డైట్ మనుషుల మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు కనీసం ఒక అరగంట అయినా యోగా, ధ్యానం వంటివి చేస్తే మంచిదని సూచిస్తున్నారు. గతంలోకి, భవిష్యత్తులోకి ప్రయాణించకుండా ఈ క్షణంలో జీవించటం మనల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. అప్పుడప్పుడు పని నుండి బ్రేక్ తీసుకుని ఇష్టమైన పనులు చెయ్యాలని, మనసుకు నచ్చిన సంగీతం వినటం, స్నేహితులను కలవటం చెయ్యాలని కూడా నిపుణులు చెబుతారు. ఆహ్లాదాన్ని ఇచ్చే పనులు చేయాలి. ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవాలి. ఒక క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవటం చాలా అవసరం. తప్పనిసరి పరిస్థితి అనిపిస్తే మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్