తిరుపతిని అన్నివిధాలా అభివృద్ది చేద్దామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితిసింగ్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధిపతులు, అధికారులతో ఎమ్మెల్యే శ్రీనివాసులు సమావేశం అయ్యారు. వ్యర్ధాలతో నిండిపోయిన డ్రైనేజిలలో మురికినీరు సాఫీగా వెళ్లేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే ఆరణి సూచించారు. రైతుబజార్, మార్కెట్లు, ఫిష్ మార్కెట్లను ఆధునీకరిస్తే బాగుంటాయని, వాటిల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మురికివాడల్లో సమస్యలు గుర్తించి వాటిని పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఎమ్మెల్యే శ్రీనివాసులు.