28.3 C
Hyderabad
Monday, June 2, 2025
spot_img

ప్రశాంత్ నాయర్‌ని పెళ్లి చేసుకున్న మలయాళ నటి లీనా

గగన్ యాన్ వ్యోమగామి గా ఎన్నికైన ప్రశాంత్ నాయర్ మలయాళ నటి లీనా భర్త. తన భర్తతో తాను కలిసి ఉన్న ఫోటోలను లీనా తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కు నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసింది. ప్రధాని మోదీ నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. వారిలో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్ తాను ఈ మధ్య వివాహం చేసుకున్నట్లు మలయాళ నటి లీనా వెల్లడించారు. ఇన్ స్టా గ్రామ్ లో తాను, భర్త ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఇది దేశానికీ, కేరళ రాష్ట్రానికీ, తనకూ ఎంతో గర్వకారణం అన్నారు. లీనా మలయాళంలో దాదాపు 175 చిత్రాలలో నటించారు.

జనవరి 17న ప్రశాంత్ తాను వివాహం చేసుకున్న ఫోటోలను, వివాహానికి హాజరైన ఇస్రో చైర్మన్ సోమనాథ్ తో కలిసి దిగిన ఫోటోలను ఆమె పోస్ట్ చేశారు. 1976లో కేరళలో పుట్టిన ప్రశాంత్.. 1998లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలెట్ గా చేరారు. అమెరికా లోని యూఎస్ స్టాఫ్ కాలేజీలో శిక్షణ పొందారు. ఇప్పుడు గగన్ యాన్ కు ఎంపికయ్యారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్