స్వతంత్ర వెబ్ డెస్క్: హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారని, డేటింగ్‌లో ఉన్నారని గతంలో సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. వీటిపై ఇప్పటికి కూడా వీరిద్దరూ స్పందించలేదు. కానీ నేడు జూన్ 9న వీరి నిశ్చితార్థం అంటూ సినీ పరిశ్రమలోని పలువురు మీడియా ప్రతినిధులు ప్రకటించారు. నిశ్చితార్థం ఇన్విటేషన్ కార్డు అంటూ ఓ ఇన్విటేషన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత కొన్నాళ్లుగా వినిపించిన లావణ్య – వరుణ్ వార్తలు నిజమే అని వీటితో క్లారిటీకి వచ్చేసారు జనాలు.
నేడు జూన్ 9న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం హైదరాబాద్‌లోని వరుణ్ తేజ్ ఇంట్లోనే జరగనున్నట్టు తెలుస్తుంది. ఈ నిశ్చితార్థం చాలా సింపుల్‌గా చేస్తున్నారు. కేవలం మెగా, అల్లు ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీలు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే ఈ నిశ్చితార్థం జరగనున్నట్టు సమాచారం. వరుణ్ – లావణ్య నిశ్చితార్థానికి చిరంజీవి, చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్.. ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ హీరోలంతా రాబోతున్నారు. నేడు సాయంత్రానికి వీరి నిశ్చితార్థం ఫొటోలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. లావణ్య ఓ తమిళ్ సినిమాలో నటిస్తుంది. మరి ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి. ఇక వీరి నిశ్చితార్థం సందర్భంగా పలువురు అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.