స్వతంత్ర వెబ్ డెస్క్: విశ్వనగరంగారూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో(Hyderabad) భూముల ధరలు (Land Prices)నగరం నడిమధ్యనే కాదు శివారు ప్రాంతాల్లో సైతం బంగారాన్ని మించిపోతున్నాయి. వారం క్రితం కోకాపేటలో(Kokapet) ఎకరం భూమి వంద కోట్లు పలుకగా తాజాగా నగరం వెలుపల బుద్వేల్‌లో(Budvel) దాదాపు రూ.42 కోట్లు పలికింది. వందెకరాల విస్తీర్ణంలోని పద్నాలుగు ప్లాట్లకు గురువారం జరిగిన ఈ-వేలంలో దిగ్గజ కంపెనీలు పోటీపడ్డాయి.
కొందరు అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించినప్పటికీ.. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ సరాసరిన నిర్దేశిత ధర కంటే 181 శాతం ఎక్కువకు కంపెనీలు భూములను దక్కించుకున్నాయి. బుద్వేల్ భూముల ద్వారా రెండువేల కోట్ల ఆదాయం వస్తుందని హెచ్‌ఎండీఏ అధికారులు అంచనా వేయగా.. దాన్ని తలదన్నేలా రూ.3,625.73 కోట్లు రావడం విశేషం.


