పేదల భూములను పరిరక్షించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకువచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈమెయిల్ ద్వారా వినతి పత్రాన్ని పంపించారు. 1982లో తీసుకువచ్చిన ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ వలన ఎంతోమంది అమాయక ప్రజల భూములు సంరక్షించబడ్డా యని అన్నారు. పేదల భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు సాధ్యమయ్యాయని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం 2016లో ఈ చట్టాన్ని రద్దు చేసిందని విమర్శించారు. దాంతో ఆక్రమణదారులు అమాయక ప్రజల భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు.