25.2 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

‘లగ్గం’ చూసి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు: రాజేంద్రప్రసాద్

సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల
రచన -దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘పెళ్లిలో ఉండే సంబురాన్ని, విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్నారు. ఇది కల్చరర్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు, కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు ఉంచే ఈ చిత్రం కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుంది’’ అని నటకిరిటి రాజేంద్రప్రసాద్ తెలిపారు.

షూటింగ్ పూర్తి చేసుకొని శర వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న లగ్గం సినిమా పాటలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతం అందించారు. ప్రముఖ ఆడియో కంపెనీ అయిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ లగ్గం ఆడియో రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకోవడం విశేషం. జూన్ 21న ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ లగ లాగ లగ్గం సాంగ్ అందరిని ఆలరించనుందని వేణు గోపాల్ రెడ్డి గారు అన్నారు.

ఈ చిత్రానికి కథ – మాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల, సంగీతం:చరణ్ అర్జున్.ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి. కెమెరామెన్: బాల్ రెడ్డి. ఆర్ట్:కృష్ణ సాహిత్యం: చరణ్ అర్జున్,సంజయ్ మహేశ్ వర్మ, కొరియోగ్రఫీ. అజయ్ శివశంకర్.

నటీనటులు:
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్య ఏలేశ్వరం, అంజిబాబు, రాదండి సదానందం, కిరీటి తదితరులు ప్రముఖ పాత్ర పోషించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్