25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

లడ్డు కల్తీ వ్యవహారం.. స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, FSSAI నుంచి ఒకరు ఉండాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించినదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది.

తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను తాను పరిశీలించానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని అన్నారు. అయితే సిట్​పై సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే దర్యాప్తుపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారురు. లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణల్లో నిజమైతే అలా జరగడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. తిరుమల శ్రీవారికి దేశ వ్యాప్తంగా భక్తులు ఉన్నారని వివరించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్